కరువు సీమలో జలసిరులు!

CM YS Jagan Lays Foundation Stones For Construction Of Projects - Sakshi

రూ.60 వేల కోట్లతో రాయలసీమకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలిస్తాం: సీఎం వైఎస్‌ జగన్‌

ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు కూడా నీళ్లు అందిస్తాం

రూ.23 వేల కోట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం

ఇదే తరహాలో తెలుగుగంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ప్రధాన కాలువల విస్తరణ

దుర్భిక్ష ప్రాంతాన్ని వరద నీటితో సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

రాయచోటిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

‘రాయచోటి గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలంటే.. తాగునీరు, సాగునీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. రాయలసీమే వెనకకబడిన ప్రాంతమైతే అందులోనూ అత్యంత వెనకబాటుకు గురైన ప్రాంతం రాయచోటి. దివంగత వైఎస్సార్‌ను అత్యధికంగా ప్రేమించే ప్రాంతం కూడా ఇదే. వైఎస్సార్‌ ఈ ప్రాంత దుస్థితిని చూసి వెలిగల్లు రిజర్వాయర్‌ నిరి్మంచారు. రాయచోటిలో ఔటర్‌ రింగ్‌రోడ్డు కూడా తెచ్చారు. నాన్న చనిపోయిన తరువాత రాయచోటి గురించి పట్టించుకోవాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితిని పదేళ్లుగా చూస్తున్నాం. గత సర్కారు హయాంలో రాయచోటి అభివృద్ధి కోసం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిధులు అడిగితే పార్టీ మారి తమ కండువా కప్పుకుంటే రూ.3 కోట్లు ఇస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇవాళ అడక్కపోయినా ఆర్నెళ్లు తిరగక ముందే రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,000 కోట్లకు పైచిలుకు ఖర్చు పెడుతున్నామని సగర్వంగా చెబుతున్నా. మీ అందరి ఆశీర్వాదం, దేవుడి దయతో మన ప్రభుత్వం నేడు అధికారంలోకి వచి్చంది. మీ కష్టాలు తీర్చేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’

‘మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇక్కడే.. ఇదే రాయచోటిలో ఎన్నికల వేళ నేను ఓ మాటిచ్చా. రాయచోటిలో ఎప్పటి నుంచో వక్ఫ్‌ బోర్డు, విద్యాశాఖ మధ్య వివాదం నెలకొన్న నాలుగు ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్‌ బోర్డుకు ఇస్తామని చెప్పాం. రేపటికల్లా ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని ఇదే  వేదిక నుంచి చెబుతున్నా (ప్రజల హర్షధ్వానాలు). రాయచోటిలో జూనియర్‌ కాలేజీ, హైస్కూలు వినియోగించుకునే గ్రౌండ్‌ను అత్యాధునిక క్రీడా మైదానంగా రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తాం’  

గత ప్రభుత్వం కాలువలను పట్టించుకోకపోవడం, సామర్థ్యాన్ని పెంచకపోవడం, సహాయ పునరావాసం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు నీళ్లు ఉన్నా డ్యాముల్లో నింపలేని దుస్థితి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఇక మార్చేస్తాం.– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి కడప: సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లు వెంచించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలించనున్నట్లు సీఎం ప్రకటించారు. మరో రూ.23 వేల కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతోపాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, హంద్రీ–నీవా, అవుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. దీనివల్ల రాయచోటితోపాటు తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు మేలు జరుగుతుందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో రూ.2 వేల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం జగన్‌ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
 

రిజర్వాయర్లున్నా నింపలేని దుస్థితి
‘‘రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో మనమంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఏడాది శ్రీశైలంలో వరదలు వచ్చాయి. ఎనిమిది సార్లు గేట్లు ఎత్తారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దాదాపు 800 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇన్ని రోజులు కృష్ణా నది నిండుగా ప్రవహించినా రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండని పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే గండికోట పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా ఇంత భారీ వర్షాలు, పైనుంచి నీళ్లు వచి్చనా కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం.చిత్రావతి కెపాసిటీ 10 టీఎంసీలు అయితే నింపగలిగింది కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే. 17.3 టీఎంసీల కెపాసిటీ కలిగిన బ్రహ్మంసాగర్‌లో కేవలం ఎనిమిది టీఎంసీలు మాత్రమే నింపగలిగే అధ్వానమైన పరిస్థితి. రిజర్వాయర్లు ఉన్నా నీటిని నింపుకోలేని దుస్థితిలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులున్నాయి. కాలువలు సరిగా లేకపోవడం, నీళ్లు పూర్తి స్థాయిలో తరలించే సామర్థ్యం లేకపోవడం, సహాయ, పునరావాసానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈరోజు నీళ్లున్నా డ్యాముల్లో నింపుకోలేని పరిస్థితిలో రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కనిపిస్తున్నాయి.

బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం  

గతంలో చేపడితే దశ, దిశ మారేది
మన ప్రభుత్వం వచ్చి కేవలం ఆర్నెళ్లే అయింది. ఆర్‌అండ్‌ఆర్‌ కింద బాధితులను తరలించాలంటే సర్వేలు జరగాలి, ఎస్టిమేట్లు తయారు కావాలి, ఇళ్ల స్థలాల కేటాయింపు జరగాలి, స్ట్రక్చరల్‌ ఇవాల్యూయేషన్‌ జరగాలి, పేమెంట్‌ ఫర్‌ రీ లొకేషన్‌ చేయాలి. ఇవన్నీ నిబంధనల ప్రకారం చేయాలంటే కనీసం ఎనిమిది నుంచి పది నెలలు పడుతుంది. ఈ పనులన్నీ కూడా గతంలో కనుక చేసి ఉంటే, కాస్తో కూస్తో డబ్బులు కనుక ఇచ్చి పనులు చేసి ఉంటే ఈపాటికి రాయలసీమలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపించేవి. ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి కాలువల సామర్థ్యం పెంచి ఉంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో ప్రాజెక్టుల దశ, దిశ మారిపోయి ఉండేవి.
 
 సామర్థ్యం పెంచి వరదను సది్వనియోగం చేసుకుంటాం
కృష్ణా నదికి వరదలు 40–50 రోజులకు మించని పరిస్థితి కనిపిస్తోంది. ఆ వరద వచి్చనప్పుడే రాయలసీమలోని ప్రతి డ్యామ్‌ నిండాలి, నెల్లూరు, ప్రకాశంలోనూ ప్రాజెక్టులు నిండాలి. దీనికోసం ఏం చేయాలనే ఆలోచన జరిగింది ఈ ఆర్నెళ్లలో. ఈ దిశగా ముందడుగు వేస్తూ వరద జలాలను సద్వినియోగం చేసుకుంటాం.
►పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం.  
►తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం.  
►కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం.  
►ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరు నగరి సుజల స్రవంతి)ని 21,700 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతాం.
►హంద్రీ–నీవా కెపాసిటీని 6,000 క్యూసెక్కులు చేస్తాం.  
►అవుకు నుంచి గండికోటకు 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతున్నాం.  
►గండికోట కాలువల సామర్థ్యాన్ని 4,000 నుంచి 6,000 క్యూసెక్కులకు పెంచుతాం.
► గండికోట నుంచి చిత్రావతికి తరలించే నీటిని 2,000 నుంచి 4,000 క్యూసెక్కులకు పెంచబోతున్నాం.  
►గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు తరలించే జలాలను వెయ్యి క్యూసెక్కుల నుంచి 1,500 క్యూసెక్కుల దాకా పెంచబోతున్నాం.  
►గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్‌కు ప్రతిపాదనల తయారీ  
 
రైతుల కోసం ఎంత చేసినా తక్కువే..
కాలువల సామర్థ్యం పెంచే పనులకు రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పినప్పుడు నేను అన్న మాట ఒక్కటే... ‘ప్రాజెక్టులు నిండాలి, రైతుల కోసం ఎంత చేసినా కూడా తక్కువే, యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయాలి’ అని ఆదేశించాం. ఎక్కడైతే మంచి మనసుంటుందో అక్కడ దేవుడి దయ ఉంటుంది, ప్రజల చల్లని దీవెనలు ఉంటాయి. మీ చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వినయంగా తెలియజేస్తున్నా.

జీఎన్‌ఎస్‌ఎస్‌ అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

కడలిలో కలిసే నీటిని సీమకు తరలిస్తాం..
ఇవాళ రాయలసీమ ప్రాంతంలో నీళ్లు రాని పరిస్థితి చూస్తున్నాం. కృష్ణా నది పరిస్థితి ఎలా ఉందో రోజూ చూస్తున్నాం. కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వచ్చే నీటి ప్రవాహంపై 47 ఏళ్లుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రికార్డులు చూస్తే కేవలం 1,200 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఇక పదేళ్ల లెక్కలు చూస్తే 1,200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పడిపోయిన దుస్థితి. ఐదేళ్లకు సంబంధించిన రికార్డులు తిరగేస్తే 600 టీఎంసీల నుంచి 400 టీఎంసీలకే పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గోదావరి జలాలు 3,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కడలిలో కలిసి పోతున్న ఈ నీటిని రాయలసీమకు తరలించే కార్యక్రమం చేపట్టాం. బొల్లాపల్లి మీదుగా తరలించి గుంటూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తాం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమలో ఇక కరువనేది ఎప్పుడూ రాకుండా చేసేందుకు గోదావరి జలాలను బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్‌కు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం రూ. 60 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పారు.

పోలీస్‌ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆమేరకు ప్రణాళిక రూపొందించి అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడుతున్నాడు మీ బిడ్డ. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి మీ బిడ్డ నడుం బిగించాడు. మీ బిడ్డకు మీ దీవెనలు కావాలి. మీ బిడ్డకు దేవుడి దగ్గర మీ ప్రార్థనలు కావాలి. మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఇవన్నీ గొప్పగా చేసి మళ్లీ మీ దగ్గరికి వచ్చి చెప్పే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా’’ ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అంజద్‌బాష, నారాయణస్వామి, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, అనిల్‌కుమార్‌ యాదవ్, చీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్‌ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ మేయర్‌ సురేబాబు, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 
రాయచోటిపై సీఎం జగన్‌ వరాల జల్లు
►రూ.1,272 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్‌ శంకుస్థాపన
►రూ.40 కోట్లతో ఝరికోన లిఫ్ట్‌  
►రూ. 86.50 కోట్లతో వెలిగల్లు లిఫ్ట్‌
►రూ.15 కోట్లతో వెలిగల్లు కుడికాలువ లైనింగ్‌
►రూ. 340.60 కోట్లతో రాయచోటి పట్టణ సుందరీకరణ, తాగునీటి సరఫరా
►రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రి 50 నుంచి 100 పడకలకు విస్తరణ
►రూ. 10 కోట్లతో రాయచోటి స్కూలు భవన నిర్మాణం.
►రూ.11.55  కోట్లతో గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం
►రూ.15.52 కోట్లతో నియోజకవర్గంలో సీసీ రోడ్లు
►రూ.31.07 కోట్లతో సీసీ ఓపెన్‌ డ్రైనేజీ సిస్టమ్‌
►రూ.4 కోట్లతో తాగునీటి పథకం
►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూలు కాంప్లెక్స్‌ (బాలురకు)
►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూలు కాంప్లెక్స్‌ భవనం
►రాయచోటికి డీఎస్పీ ఆఫీస్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు
 
కడపలో పోలీస్‌ కార్యాలయం
►రూ.20.95 కోట్లతో కడపలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం
►రూ.1,272 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌– హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్‌ శంకుస్థాపన 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top