సీఎం అండతోనే భూ దందా | CM support with land mafia | Sakshi
Sakshi News home page

సీఎం అండతోనే భూ దందా

Mar 6 2016 1:17 AM | Updated on Jul 28 2018 3:23 PM

సీఎం అండతోనే రాజధాని భూ దందా చేశారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు.

పీసీసీ అధికార ప్రతినిధి శివాజీ

 విజయవాడ సెంట్రల్:  సీఎం అండతోనే రాజధాని భూ దందా చేశారని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు. గాంధీనగర్‌లోని తన  కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. భూ దురాక్రమణ సాక్ష్యాధారాలతో  సహా వెలుగుచూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు.

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. లోకేష్ జోక్యంతో అవినీతి పేట్రేగుతోందన్నారు. ప్రజాస్వామ్య విలువలపై చంద్రబాబుకు గౌరవం ఉంటే  జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement