24న సూరంపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan To Tour Gannavaram Constituency On 24 October - Sakshi

సీపెట్‌ భవనాలను ప్రారంభించనున్న సీఎం

సాక్షి, గన్నవరం: ఈ నెల 24న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సీపెట్‌ భవనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ హాజరుకానున్నారు. సీఎం జగన్‌ పర్యటన ఏర్పాట్లను సోమవారం.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాధవిలత, సీఎం ప్రొగాం కో​‍ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ గన్నవరం ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వీప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top