వచ్చే నెల ఒకటిన సీఎం రాక

CM Jagan Coming September One In Srikakulam - Sakshi

సన్నబియ్యం పంపిణీని  ప్రారంభించనున్న వైఎస్‌ జగన్‌

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడి

నరసన్నపేట: వచ్చే నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి జిల్లాకు రానున్నార ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పైలెట్‌ ప్రాజెక్టును సీఎం జిల్లాలో ప్రారంభించనున్నారని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే సభ కోసం వివిధ ప్రదేశాలను జిల్లా కలెక్టర్‌ నివా స్‌తో కలిసి మంత్రి సోమవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సీఎంకు ఘ నస్వాగతం పలకనున్నామని చెప్పారు. నరసన్నపేటలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని, సభా వేదిక కోసం స్థలాలను పరి శీలి స్తున్నామన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని 25న రాష్ట్రానికి వస్తారని, అనంతరం ఆయన పర్యటనపై మరింత స్పష్టత వస్తుందన్నారు. సన్నబియ్యం పంపిణీని జిల్లా నుంచే ప్రారంభించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారని తెలిపారు.

ఈదులవలస కూడలి దాదాపు ఖరారు...
సభా వేదికగా నరసన్నపేట ప్రభుత్వ జూని యర్‌ కళాశాల మైదానాన్ని ముందుగా ఎంపి క చేసినా.. ఆ రోజున సచివాలయ ఉద్యోగాల కోసం ఇక్కడ పరీక్షలు నిర్వహించనున్నందు న ఇబ్బందులు వస్తాయని భావించి మరికొ న్ని స్థలాలను పరిశీలించారు.వంశధార కార్యాలయ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంతోపాటు  ఈదులవలస కూడలిలో ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ స్థలం అనువుగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ నివాస్‌ నిర్ధారణకు వచ్చి నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రితో చర్చించా రు. పోలీస్‌ అధికారులు పరిశీలించిన తరువాత స్పష్టత వస్తుంది. మంత్రి వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, చింతు రామారావు, ఆరంగి మురళి, కేసీహెచ్‌బీ గుప్త, ఎంపీడీఓ ఆర్‌.వెంకటరావు, తహసీల్దార్‌ ప్రవల్లికాప్రియ, ఈఓపీఆర్డీ రవికుమార్, ఈఓ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top