ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా | Clear Passport Mela | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా

Jun 15 2014 2:05 AM | Updated on May 3 2018 3:17 PM

ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా - Sakshi

ప్రశాంతంగా పాస్‌పోర్ట్ మేళా

పాస్‌పోర్ట్ మేళా శనివారం ప్రశాంతంగా ముగిసింది. బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మేళా జరిగింది. మేళాలో 800 మంది అభ్యర్థులకు అధికారులు అవకాశం కల్పించారు.

విశాఖపట్నం : పాస్‌పోర్ట్ మేళా శనివారం ప్రశాంతంగా ముగిసింది. బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మేళా జరిగింది. మేళాలో 800 మంది అభ్యర్థులకు అధికారులు అవకాశం కల్పించారు. మూడు రోజుల ముందుగా ప్రత్యేక స్లాట్ బుకింగ్‌తో అభ్యర్థులు మేళాలో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు మేళాలో పాల్గొనవచ్చని ప్రకటించారు.

స్లాట్ బుకింగ్‌లో తెలిపిన సమయం ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. త్వరతిగతిన సేవలు లభించడంతో పనులు వేగవంతంగా ముగిశాయి. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థులు ఎండవేడిమికి అవస్థలు పడ్డారు. గ్రీన్ బెల్ట్‌లోని చెట్ల కింద కూర్చొని సేదతీరారు.

ప్రస్తుతం స్లాట్ బుకింగ్ పొందడానికి సుమారు నెలన్నర రోజులకు పైగా పడుతుండగా, మేళా నిర్వాహణ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్ సేవలు లభ్యం కావడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 28న మరోసారి మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement