గొట్టిపాటి వర్గం దౌర్జన్యం

Clashes Between TDP & YSRCP Activists In Addanki - Sakshi

తెలుగు తమ్ముళ్ల ఆగడాలతో ముగిసిన ఎన్నికలు

చోద్యం చూసిన పోలీసులు, అధికారులు

సాక్షి, అద్దంకి (ప్రకాశం): నియోజకవర్గంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతలు పలు చోట్ల బరితెగించారు. సంతమాగులూరు మండలంతో పాటు, బల్లికురవ మండలంలోని అడవిపాలెం, వేమవరం గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ ఏజంట్లను సైతం బయటకు పంపి రిగ్గింగ్‌ చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారు. కొరిశపాడు మండలం మేదరమెట్లలో టీడీపీ నాయకులు ఓటర్లను భయపెట్టి వారి ఓట్లను లాక్కుని తామే వేసుకోవడానికి ప్రయత్నించారు. అద్దంకి మండలం బొమ్మనంపాడులో ఓట్లను తమకు చూపించి వేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు పోలింగ్‌ను కొంతసేపు నిలిపేశారు. అద్దంకి పట్టణంలో ప్రకాశం జూనియర్‌ కళాశాలలో ఒక బూత్‌ వద్ద ఒక బూత్‌లో టీడీపీ నాయకులు ఓటర్ల వెంట వెళ్లి తామే ఓటు వేశారు. పలు చోట్ల టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులపై చేయి చేసుకున్న ఘటనలున్నాయి. 

సంతమాగులూరులో దాడులకు దిగిన టీడీపీ నాయకులు
తెలుగుతమ్ముళ్లు ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను ఓటర్లను, బూత్‌ ఏజెంట్లను బెదిరించారు. ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడారు. పోలింగ్‌ బూత్‌లో వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులను బెదిరించి బలవంతంగా బూత్‌ నుంచి బయటకు పంపిన ఘటనలున్నాయి. మండల పరిధిలోని అడవిపాలెం, చవిటిపాలెం, తంగేడుమల్లి గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. వారిని లోపలకి రానివ్వకుండా బెదిరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక్షపాత్ర వహించారు. అడవిపాలెంలో టీడీపీ నాయకులు వైస్‌స్రాŠ సీపీ నాయకులుపై దౌర్జన్యం చేసి బూత్‌ల్లో నుంచి బయటకు తరిమారు.వెబ్‌ కెమెరాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు.

తంగేడుమల్లిలో మొత్తం 1700 ఓట్లు ఉన్నాయి. 900 ఓట్లు ఒక బూత్‌లో, 800 ఓట్లు మరో బూత్‌లో ఉన్నాయి. ఈ రెండు బూత్‌లో టీడీపీ నాయకులు ఓట్లన్ని టీడీపీకే వేసుకోవడానికి ప్రయత్నించావరు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లును బలవంతం చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య అక్కడకు వచ్చి అధికారులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా ఓటు వేసుకునే అర్హత లేదా అని అధికారులను నిలదిశారు. చవిటిపాలెంలోనూ టీడీపీ నాయకులు బలవంతంగా వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లును బయటకు పంపించడానికి బెదిరింపులకు దిగి వారిపై దాడి చేశారు. సమీపంలోని ప్రైవేట్‌ కారు డ్రైవరు సెల్‌ చూసుకుంటుడగా ఫోటోలు తీస్తున్నారన్న అనుమానంతో టీడీపీ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. మండలంలోని ఏల్చూరు, మక్కెనవారిపాలెం, కొప్పరం, వెల్లలచెరువు, పుట్టవారిపాలెం గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు సృష్టించారు. 

పోలీసులు వన్‌సైడ్‌ 
దాదాపు సంతమాగులూరు మండల పరిధిలోని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వారు ఎటువంటి గొడవులు, అలజడులు చేస్తున్నా పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు.  ప్రతి గ్రామంలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి మౌనంగా ఉన్నారు.

బెదిరింపులకు పాల్పడిన మక్కెనవారిపాలెం టీడీపీ నాయకులు
మక్కెనవారిపాలెంలోని 43వ వార్డులో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరించి బలవంతంగా సైకిల్‌ గుర్తుపై ఓటు వేయించారు. ఈ ఘటనపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు.  ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉండటంతో వారు దాడులకు పాల్పడినట్లు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మాజీ సర్పంచ్‌పై టీడీపీ నాయకులు దాడి
మండల పరిధిలోని పుట్టావారిపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల్లో పుట్టావారిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ అద్దంకి ఆంజనేయులుపై టీడీపీ వర్గీయుడు ఎంపీపీ కుమారుడు కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓటు వేసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో స్వల్ప వివాదం జరిగి అతనిపై టీడీపీ నాయకులు దాడి చేశారు.

టీడీపీ నాయకులపై కలెక్టర్‌కు ఫిర్యాదు..
మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విలువలేకుండా పోయిందన్నారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top