చోడవరం ఎస్‌ఐపై వేటు | CHODAVARAM been placed | Sakshi
Sakshi News home page

చోడవరం ఎస్‌ఐపై వేటు

Sep 1 2014 1:02 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక తుఫాన్ దెబ్బ మరో ఎస్‌ఐకి తగిలింది. చోడవరం ఎస్సై విజ య్‌కుమార్‌ను వీఆర్‌లో పెడుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదివా రం ఉత్తర్వులు వచ్చాయి.

  •    వీఆర్‌లో పెడుతూ ఉత్తర్వులు
  •      ఇసుక మాఫియా సంఘటన
  • చోడవరం : ఇసుక తుఫాన్ దెబ్బ మరో ఎస్‌ఐకి తగిలింది. చోడవరం ఎస్సై విజ య్‌కుమార్‌ను వీఆర్‌లో పెడుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదివా రం ఉత్తర్వులు వచ్చాయి. ఇటీవల జిల్లా ఎస్పీ ప్రవీణ్ చోడవరం పరిసరాల్లో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలపై ఆకస్మిక దాడు లు చేయడం, సీఐని సస్పెండ్ చేయడం తెలిసిందే. దీనిలోభాగంగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణపై చో డవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట ఎస్‌ఐలను కూడా విచారించినట్టు తెలిసింది.

    ఈ మేరకు చోడవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టారు. ఈ చర్యలతో మిగతా పోలీసు అధికారుల్లో కూడా గుబు లు పట్టుకుంది. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు కొందరు ఇసుక వ్యాపారులను కూడా విచారించినట్టు తెలిసింది.
     

Advertisement
 
Advertisement
Advertisement