భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణ: చిరంజీవి | Chiranjeevi inaugurates World Tourism Organisation (UNWTO) meeting | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణ: చిరంజీవి

Sep 14 2013 1:11 PM | Updated on Sep 1 2017 10:43 PM

పర్యాటక రంగం భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని అతిధ్య రంగాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కోరారు.

హైదరాబాద్ : పర్యాటక రంగం భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని అతిధ్య రంగాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కోరారు. అంతర్జాతీయ స్థాయి వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.  హైదరాబాద్‌ హోటల్‌ పార్క్‌లో జరిగిన 'దక్షిణ ప్రాంత పర్యాటక సలహా మండలి' సమావేశంలో ముఖ్య అతిధిగా  చిరంజీవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగం కొత్తరూపాన్ని సంతరించుకునే తీరులో ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగానికి సంబంధించిన డైరెక్టరీని ఈ సందర్భంగా చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌, పర్యాటక  ప్రత్యేక కార్యదర్శి చందనా ఖన్‌, కర్ణాటక టూరిజం మంత్రి ఆర్వీ దేశ్‌పాండే పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement