చిరంజీవి అభిమానుల సమావేశం | Chiranjeevi fans meeting | Sakshi
Sakshi News home page

చిరంజీవి అభిమానుల సమావేశం

Mar 22 2015 4:53 AM | Updated on Mar 22 2019 5:33 PM

చిరంజీవి - Sakshi

చిరంజీవి

కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి అభిమాన సంఘాలు ఆదివారం సమావేశమవుతున్నాయి.

హైదరాబాద్‌: కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి అభిమాన సంఘాలు ఆదివారం సమావేశమవుతున్నాయి. చిరంజీవి ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే విషయంలోనూ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన కేవలం నాలుగు రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు, కార్యక్రమాల కొనసాగింపు నేపథ్యంలో తదనంతర కార్యాచరణపై చిరంజీవి అభిమానుల్లో తర్జనభర్జన సాగుతోంది.

మరోవైపు చిరంజీవి 150వ చిత్ర నిర్మాణంపైనే దృష్టి సారించారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాజా పరిణామాలతో పాటు భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించనున్నారు. అభిమాన సంఘాల ఎన్నికలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement