చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి | chiranjeev comments foolish: m v mysoora reddy | Sakshi
Sakshi News home page

చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి

Aug 4 2013 10:17 AM | Updated on Sep 19 2018 6:29 PM

చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి - Sakshi

చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి

హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్నేత మైసూరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్నేత మైసూరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల 3 ప్రాంతాలకు నదీజలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర నదీజలాల బోర్డు ఏర్పడితే ప్రాజెక్ట్లు వట్టిపోతాయని మైసూరారెడ్డి తెలిపారు.

యూపీఏ అధ్యక్షురాలు సోనియా నిర్ణయంతో దేశం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేదన్న ఒకే ఒక్క స్వార్థంతో రాష్ట విభజన చిచ్చుపెట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు.

విదేశీయురాలైన సోనియాకు దేశ సమగ్రతపై ఏమంత అవగాహన ఉందని దాడి వీరభద్రరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికి రెండో రాజధానిగా చేయాలి లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement