ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జనవరి 1న ఏలూరులో రానున్నారు.
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జనవరి 1న ఏలూరులో రానున్నారు. ఆ రోజు సాయంత్రం హెలికాప్టర్‌లో ఏలూరు చేరుకుని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభి స్తారు. ఇదే సందర్భంలో ఉచిత ఆరోగ్య పరీక్షల పథకాన్ని, గర్భిణులకు, బాలింతలకు అందించే ఐదు రకాల వైద్యసేవలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం కేక్ కట్‌చేసి నూతన సంవత్సర వేడుకలను ప్రజల మధ్య జరుపుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం పరిశీలించారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో హెలిప్యాడ్‌ను ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్ పరిశీలించారు.