ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా? అంటూ దళితులను కించపరిచేలా వాఖ్య లు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ,
విజయనగరం మున్సిపాలిటీ : ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా? అంటూ దళితులను కించపరిచేలా వాఖ్య లు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం విజయనగరంలోని అంబేద్కర్ కూడలిలో జరిగిన నిరసన ధర్నాలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం అంబేద్కర్ జంక్షన్‌కు చేరుకున్న వారు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. మేరుగు నాగార్జున, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్‌లు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు.
మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా పాలన సాగించారన్నా రు. తమ పార్టీ అధినేత వైస్‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో దళి తులకు అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు సోము కోటేశ్వరరావు, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు, పట్నాన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.