బీఎస్‌–6 వాహనాలతో కాలుష్యానికి చెక్‌

Check For Pollution With BS 6 Vehicles - Sakshi

ఈ నెలాఖరుతో బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌ బంద్‌ 

పర్యావరణ పరిరక్షణకు సాంకేతికత తోడ్పాటు  

మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీ గంగాధర్‌

పార్వతీపురం: భారతస్టాండర్ట్‌కు సంక్షిప్త రూపమే బీఎస్‌. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను అనుసరించి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2010 సంవత్సరంలో మార్కెట్‌లోకి వచ్చిన బీఎస్‌–3 వాహనాలు 2017 మార్చి 31 వ తేదీ వరకు విస్తరించాయి. 2017 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌–4 వాహన శ్రేణి అందుబాటులోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా తాజాగా బీఎస్‌–6 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

మేలుకుంటే మంచిది...  
ఆర్థిక మందగమనం ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్నా కొత్త వాహనాల క్రయ విక్రయాలు బాగానే సాగుతున్నాయి. జిల్లాలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల వినియోగం అధికంగానే ఉంది. ఈ వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు  తగిన చర్యలు చేపట్టింది.

అందులో భాగంగానే బీఎస్‌–4 (భారత్‌ స్టాండర్డ్‌) వాహనాల రిజిస్టేషన్‌ నిలిపివేసే చర్యలు చేపట్టింది. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే బీఎస్‌–4 వాహనాలను రిజిస్టేషన్‌ చేస్తారు. ఆ తర్వాత రిజి్రస్టేషన్‌ చేసే అవకాశాలు లేవని రవాణా శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే రిజి్రస్టేషన్‌ చేయనున్నారు. బీఎస్‌–4 వాహనాల్లో వాయు కాలుష్య కారకాలు ఉన్నాయని భావిస్తూ వాటిని తగ్గించేందుకు  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బీఎస్‌–6 వాహనాలకు అనుమతి ఇచ్చింది. మోటారు కంపెనీలు కూడా బీఎస్‌–6 వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లు లేకుంటే సీజ్‌.... 
ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌–4 వాహనాల రిజిస్టేషన్‌ నిలిపివేస్తున్న నేపథ్యంలో  కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాహ నం కొనే సమయంలో అది ఏ ప్రమాణాలతో కూడిన  వాహనమో పరిశీలించి తీసుకుంటే మేలు. ఇతర వ్యక్తు ల నుంచి వాహనాలు కొనే సమయంలో  సంబంధిత పత్రాలు  క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి. పొరపాటున మార్చి తర్వాత  బీఎస్‌–4 వాహనాలు కొత్తవి తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌–4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ లే కుండా రోడ్లప తిప్పితే రవాణా శాఖ అధికారులు సీజ్‌ చేస్తారు.  తాత్కాలిక  రిజిస్ట్రేషన్‌ ఉన్నా అదే పరిస్థితి.

ఆఫర్ల వల.... 
మార్చి 31లోగా వాహనాల డీ లర్లు బీఎస్‌–4 వాహనాలను తప్పనిసరిగా విక్రయించాలి. లేదంటే తమ బంధువులు, ఇ తరుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చే సుకోవాలి. లేదంటే వాటిని  విక్రయించే  అవకాశం లేదు. దీంతో లాభాలు లేకున్నాసరే తమ వద్ద ఉన్న బీఎస్‌ –4 వాహనాలను వదిలించుకునేందుకు  రూ.10 వేలు నుంచి రూ.15వేల వ రకు ఆఫర్లు ఇస్తూ కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు.

శాశ్వత రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి 
బీఎస్‌–4 వాహనాలు తప్పనిరిగా ఈ నెలాఖరులోగా శాశ్వత  రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. లేదంటే వాహనాలు సీజ్‌ చేస్తాం. గడువు దాటితే షోరూమ్‌లో ఉన్న వాహనాలు కూడా బయట తిరిగే అవకాశం ఉండదు. డీలర్లకు ఇప్పటికే సూచనలిచ్చాం. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంపొందించుకోవాలి. కాలుష్య కారకాలను తగ్గించేందుకే ప్రభుత్వం బీఎస్‌–6 వాహనాల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో బీఎస్‌–7, బీఎస్‌–8 వాహనాలుకూడా వచ్చే అవకాశం ఉంది.    
 – ఎంవీఐ గంగాధర్, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, పార్వతీపురం

ఆఫర్లు వచ్చి అమ్ముతున్నాం...  
లాభాల లేక చాలా రోజులైంది. ప్రస్తుతం బీఎస్‌–4 వాహనాలను ప్రత్యేక ఆఫర్లతో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. బీఎస్‌–4 వాహనాలు ఇప్పటికే సాంకేతికంగా ఆదరణ పొందాయి. మరింత కాలుష్య నివారణకు బీఎస్‌–6 వాహనాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వినియోగదారులపై వాహన రేట్లు కొంతమేర అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. కార్బరేటర్‌ లేకుండా కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే షోరూంలలో మాత్రమే బాగుచేసుకోవాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఉంటుందే తప్ప ఇతరత్రా అవకాశం ఉండదు. ఏది ఏమైనా బీఎస్‌–6 వాహనాలతో కాలుష్య నివారణతో పాటు వాతావరణ సమతుల్యత కొంతమేర మెరుగుపడి భావితరాలకు ఉపయుక్తం కాగలదు.
– శ్రీనివాసరావు, టీవీఎస్‌ షోరూం యజమాని, పార్వతీపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top