తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన జిల్లాకు రానున్నారు.
సాక్షి, ఒంగోలు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 23వ తేదీన జిల్లాకు రానున్నారు. చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం నెల్లూరు నుంచి చంద్రబాబునాయుడు ఉదయం 10.30కు టంగుటూరులో ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఒంగోలుకు 11 గంటలకు చేరుకుని నగరంలోని హోటల్ సరోవర్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని 12 గంటలకు జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభలో, అనంతరం రాత్రి 7 గంటలకు బాలాజీ తిరుపతిరావు కల్యాణ మండపంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతారని జనార్దన్ పేర్కొన్నారు.