సీఎం విమానాలకు 8 నెలల్లో 15 కోట్లు ఖర్చు!

సీఎం విమానాలకు 8 నెలల్లో 15 కోట్లు ఖర్చు!


* నగదు విడుదల చేస్తూ.. జీవో జారీ

* కాంట్రాక్టు, చిరుద్యోగుల వేతనాలు బంద్


 

 సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల ప్రయాణ చార్జీల నిమిత్తం 8 నెలలకు సంబంధించి రూ.15 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలు వేర్వేరుగా జీవోలు జారీ చేశాయి. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నెల 8 వరకు 67 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన విషయాన్ని ‘సాక్షి’ పాఠకులకు గతంలోనే తెలియజేసింది.


ఢిల్లీ, బెంగళూరు సహా చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కోసం పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. వారు గత 5 మాసాల నుంచి పనిచేస్తున్నా వేతనాలకు సంబంధించిన ఫైలు మాత్రం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో మగ్గుతోంది.


అలాగే వైద్య ఆరోగ్య శాఖలోని 8 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలివ్వడం లేదు. అలాగే ఉపాధి హామీ పథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న క్షేత్రస్థాయి సహాయకులకు గత నెల వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top