సీఎం మేనల్లుడి మృతి

Chandrababu naidu Son in law Died With Illness in Hospital Chittoor - Sakshi

నేడు అంత్యక్రియలు

చిత్తూరు, చంద్రగిరి : సీఎం చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌ కుమార్‌(43) శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన కందులవారిపల్లెకు తీసుకొచ్చారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి, నారా ఇందిర, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి శుక్రవారం సాయంత్రం కందులవారిపల్లెకు చేరుకున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆ గ్రామానికి చేరుకుని ఉదయ్‌ మృతదేహం వద్ద నివాళులర్పించారు. శనివారం ఉదయ్‌ కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top