రాష్ట్రం కాంగ్రెస్వారి తాత జాగీరా?: చంద్రబాబు | Chandrababu Naidu Atmagowrava Yatra | Sakshi
Sakshi News home page

రాష్ట్రం కాంగ్రెస్వారి తాత జాగీరా?: చంద్రబాబు

Sep 1 2013 3:22 PM | Updated on Jul 28 2018 7:54 PM

రాష్ట్రం కాంగ్రెస్వారి తాత జాగీరా?: చంద్రబాబు - Sakshi

రాష్ట్రం కాంగ్రెస్వారి తాత జాగీరా?: చంద్రబాబు

రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వారి తాత జాగీరా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

గుంటూరు: రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వారి తాత జాగీరా అని  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా  పొందుగుల గ్రామంలో ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో సంపద సృష్టించింది, ఉద్యోగాలు సృష్టించింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చే పరిస్థితిలేదని చెప్పారు.  తెలుగు జాతిపై కుట్రపన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్లు రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.  ఎవరూ ఓడిపోకుండా అందరూ గెలవాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆందోళన చేసేవారిని కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యను పరిష్కరించాలన్నారు. అందరూ రోడ్డు మీద ఉన్నారు, కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.   సమస్యలు పరిష్కరించే సత్తాలేకపోతే రాజీనామా చేయాలన్నారు.

దేశాన్ని దోచుకుంటుంటే యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. దేశంలోని సంపదంతా సోనియా కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సోనియా గాంధీకి డబ్బు పిచ్చని,  బ్రిటీష్ వారి మాదిరిగా దోచుకుంటున్నారన్నారు. అల్లుడు వార్దా కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపించారు.  మనకు మనకు తగాదా పెట్టిన దుర్మార్గురాలు సోనియా గాంధీ అన్నారు.   ప్రధాని శాఖలో 189 పైళ్లు మాయమైతే ఫైళ్లకు కాపలాదారుడినా అని ప్రధాని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఫైళ్లను కాపాడలేని ప్రధాని దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement