కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్‌ మాల్‌’  ప్రారంభం | Chandrababu to launch Y screens in west godavari district kovvur | Sakshi
Sakshi News home page

కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్‌ మాల్‌’  ప్రారంభం

May 6 2019 9:05 AM | Updated on May 6 2019 9:09 AM

Chandrababu to launch Y screens in west godavari district kovvur - Sakshi

సాక్షి, అమరావతి :  మిని డిజిటల్‌ థియేటర్‌ కాన్సెప్ట్‌తో బాగా ప్రాచుర్యం పొందిన వై స్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కొవ్వూరులో వై స్క్రీన్స్‌  మాల్‌ను ప్రారంభించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులోని మెయిన్‌ బైపాస్‌ రోడ్డులో మంగళవారం(మే 7వ తేదీ) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. 

వై స్క్రీన్స్‌  ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(వైఎస్‌టీడీ సెంటర్‌) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ మాల్‌లలో మిని డిజిటల్‌ థియేటర్, ప్రభుత్వ సేవలు అందించే మీసేవ, బ్యాంక్‌ ఏటీఎమ్‌లు, గేమింగ్‌ జోన్, కాఫీ షాప్స్, బ్రాండెడ్‌ వస్తువుల విక్రయశాలలు, కార్పొరేట్‌ ఆఫీస్‌ కార్యాలయాలు ఉండనున్నాయి. వై స్క్రీన్స్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ వైవీ రత్నకుమార్‌ ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన థియేటర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందటంతోపాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement