చంద్రబాబుకు సిగ్గుందా?: సీఆర్ | chandrababu invites congress leaders ashamed | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సిగ్గుందా?: సీఆర్

Sep 21 2014 2:13 PM | Updated on Aug 14 2018 3:05 PM

చంద్రబాబుకు సిగ్గుందా?: సీఆర్ - Sakshi

చంద్రబాబుకు సిగ్గుందా?: సీఆర్

కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు సిగ్గుందా అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు సిగ్గుందా అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ స్వలాభాల కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. రాత్రికి రాత్రి పార్టీలు మార్చిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డిదని గుర్తు చేశారు.

దివాకర్ రెడ్డి ఎంత మందిని చంపించాడన్నది తాడిపత్రి సమావేశంలోనే వెల్లడించామని చెప్పారు. కాంగ్రెస్ లో అపవిత్రులుగా ఉన్నవారు టీడీపీలో చేరగానే పవిత్రులయ్యారా అంటూ రామచంద్రయ్య ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement