ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. రైతుల రుణమాఫీ విధాన ప్రకటనకు సంబంధించి చంద్రబాబు సమీక్షించనున్నారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఈ నెల 5న వైఎస్ఆర్ సీపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ రుణమాఫీపై విధాన ప్రకటన చేయనున్నట్టు వెల్లడించింది.