
రాజ్యాంగాన్ని గౌరవించు
ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు.
చంద్రబాబుకు టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం హితవు
సమన్యాయం పేరిట అన్యాయం చేయొద్దు
ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడికే వెళ్లాలి
సిద్దిపేట : ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. సమన్యాయం పేరిట తెలంగాణకు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణలోనే పనిచేయాలని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లోనే పనిచేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జోనల్‌స్థాయి వరకు రాజ్యాంగబద్ధమైన సూచనలు, నిబంధనలు ఆమలుపర్చాల్సిందేనన్నారు.
తాత్కాలిక ఉద్యోగ కేటాయింపుల్లోనే రాజ్యాంగంలోని 370(డీ), రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కాగా ఆమలు చేయలన్నారు. న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖల్లో తెలంగాణ ప్రాంత అధికారులు లేరన్నారు. ఇలాంటప్పుడు ఆంధ్ర అధికారుల పెత్తనాన్ని తెలంగాణ రాష్ట్రం ఎందుకు భరిస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద వచ్చే నెల 1న రాత్రి 8 గంటల నుంచి రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతాయన్నారు