రాష్ట్రం తగలబడిపోతున్నా పట్టించుకోకుండా... జగన్మోహన్ రెడ్డి బెయిల్ను అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరు : రాష్ట్రం తగలబడిపోతున్నా పట్టించుకోకుండా... జగన్మోహన్ రెడ్డి బెయిల్ను అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. ఉద్యోగుల దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మరోవూపు గూడూరు గర్జనకు భారీ స్పందన వచ్చింది.
తిరుపతిలోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రేణిగుంట సీఆర్‌ఎస్ ఎదుట ఎన్జీవోల నిరసనకు దిగారు. రైల్వే ఉద్యోగులు విధులకు వెళ్లనివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ఉద్యోగ జేఏసీ మూసివేయించింది. సమైక్యంధ్రకు మద్దతుగా ఉరవకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. పొన్నూరు ఐలాండ్ సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.