ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు దాదాపు 5 గంటల పాటు చర్చించారు.
రుణమాఫీ అమలుకు ఎదురవుతున్న సమస్యల గురించి చంద్రబాబు చర్చించారు.
రైతులకు 25 రూపాయల ముఖవిలువతో ఒక్కో బాండు జారీ చేయాలని నిర్ణయించినట్టు ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. ఇందుకోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలివిడతగా 7 వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి తర్వాత రైతులు బాండ్లను తీసుకెళ్లి కార్పొరేషన్లో డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. ఇది రుణమాఫీ కాదని రైతులకు ఆర్థిక సాయమేనని సుజనా చౌదరి తెలిపారు. ఖరీఫ్ రుణాల మంజూరుకు గడువు పెంచారు. పాతఅప్పులపై వడ్డీ భారాన్ని రైతులే మోయాలని తెలిపారు.