వైభవంగా శ్రీవారి చక్రస్నానం | chakra snanam in tirumala | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

Jan 2 2015 11:59 AM | Updated on Sep 2 2017 7:07 PM

ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో శుక్రవారం చక్రస్నానం కార్యక్రమం వైభవంగా జరిగింది.

తిరుపతి: ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో శుక్రవారం  చక్రస్నానం కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి సుదర్శన చక్రత్తాశ్వారును ఆలయం నుంచి పుష్కరిణి చెంతకు పల్లకిలో వూరేగింపుగా తీసుకొచ్చారు.  మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం, పవిత్ర తులసి దళాలతో పూజలు నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వారుకు పుష్కరిణి అభిషేకం చేశారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొని పుణ్య స్నానాలాచరించారు.
 
 మరోవైపు తిరుమలలో భక్తుల రద్తీ కొనసాగుతుంది. ద్వాదశి సందర్భంగా సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండి కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇవాళ అర్ధరాత్రి వరకు వైకుంఠదర్శనం కల్పిస్తామని తితిదే ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement