తుది దశకు పోస్టుల భర్తీ

Certificate Verification Of Grama Sachivalayam Candidates In Vizianagaram - Sakshi

జోరందుకున్న సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయిన పోస్టుల మెరిట్‌ జాబితాలు

మరో వైపు ప్రశాంతంగా కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన

సచివాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రెండు రోజుల్లో నియామకపత్రాల జారీకి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని పోస్టులకు మెరిట్‌ జాబితాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడమే గాకుండా... అందులో స్థానం సంపాదించినవారి ధ్రువీకరణ పత్రాల పరిశీలన చురుగ్గా చేపడుతున్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తనీయకుండా... పూర్తి పారదర్శకంగా చేపడుతున్న ఈ ప్రక్రియతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. 

నేడు ధ్రువీకరణ పత్రాల పరిశీలన వీరికి: 
వెల్పేర్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ పోస్టులు 287 మందికి, మహిళా పోలీస్‌ 647 మందికి ధ్రువపత్రాల పరిశీలన శనివారం ఉంటుందని జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తెలిపారు.

సాక్షి, విజయనగరం: గ్రామ, సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రి య జోరందుకుంది. ఈ క్రతువును వేగవంతంగా పూర్తి చేసేం దుకు అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. వేలాది మంది కి ఉద్యోగాల  కల్పన ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో  ముగి యనుంది. ఇప్పటికే వేలాదిమంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. మిగిలినవారి ధ్రువపత్రాల పరిశీలన శనివారం నాటికి ముగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

1238 మంది ధ్రువపత్రాల పరిశీలన  
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం 1238 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. 1492 మందికి 1238 మంది హాజరయ్యారు. పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ పోస్టులకు 62 మందికి 61 మంది, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు 268 మందికి  218 మంది, పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌ – 5) 286 మందికి 236 మంది, వీఆర్వో పోస్టులు 56 మందికి 48మంది, విలేజ్‌ సర్వేయర్‌ 248 మందికి 245 మంది, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు 190 మందికి 182 మంది. వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ 88మందికి 66 మంది, వెల్పేర్, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు 294 మందికి 182 మంది హాజరయ్యారు.

నియామక పత్రాల పంపిణీ రేపు
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఈ నెల 30వ తేదీన అందించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎం. హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇన్‌చార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారిని ఉద్దేశించి 30వ తేదీన ప్రసంగిస్తారని, ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్కీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఆ కార్యక్రమానికి హాజయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత సంబం ధిత శాఖల అధికారులపై ఉందని చెప్పారు. సబ్జెక్టుల వారీగా అభ్యర్థులందరినీ వరుస క్రమంలో కూర్చోబెట్టి ప్రణాళికా బద్ధంగా పోస్టింగ్‌ ఆర్డర్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు.

ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఒకేసారి లక్ష 26 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకం. మెరిట్‌ అధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలకు మాత్రమే గతంలో నోటిఫికేషన్లు వచ్చేవి. అవి భర్తీ చేయడానికి చాలా సమయం పట్టేది. అలాంటిది ఒకేసారి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– అసియా బేగం, కాట వీధి, విజయనగరం

సీఎంపై నమ్మకాన్ని పెంచింది
పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల సీఎంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచింది. నేను నిరుపేద కుటుంబానికి చెందినవాడను. మా నాన్న  గృహాలకు పెయింటింగ్‌ వేస్తూ మమ్మల్ని చదివించారు. నేను ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికయ్యాను. విశ్వబ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది.
– చిట్టూరి సాయికుమార్, కొత్తపేట, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top