సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందేనని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
కాకినాడ: సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. వడ్డీ మహేశ్ హవాలా కేసును సీఐడీకి అప్పగించినట్లు చినరాజప్ప తెలిపారు. మహేశ్ వెనుక ఎవరున్ననేది విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు.