రంకేసిన గుంటూరు జిల్లా ఎద్దులు

Cattle Race In Guntur District  - Sakshi

ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఇనిమెట్ల గిత్తలు

సాక్షి, సత్రశాల (రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం సమీపంలోనున్న అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో గుంటూరు జిల్లా ఎద్దులు రంకేశాయి. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో భాగంగా 6వ రోజు గురువారం రెండు పళ్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 జతల గిత్తలు పాల్గొన్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అరిగెల కార్తీక్‌ నాయుడు, రమ్యనాయుడు గిత్తలు 4,800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.20వేలను కైవసం చేసుకున్నాయి.

నకరికల్లు మండలం కుంకనగుట్ల గ్రామానికి చెందిన బల్లగిరి వెంకటేశ్వర్లు ఎడ్లు 4,690.2 అడుగుల దూరం లాగి 2వ బహుమతి రూ.15 వేలను దక్కించుకున్నాయి. ఫిరంగిపురం మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన యేరువ శ్రీనివాసరెడ్డి, అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన నెట్టం గీతా చౌదరి కంభైడ్‌ ఎడ్లు 4,658.5 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.10వేలను కైవసం చేసుకున్నాయి. చేబ్రోలు మండలం తోటపాలెం గ్రామానికి చెందిన రామినేని రత్తయ్య ఎడ్లు 4,642.11 అడుగుల దూరం లాగి 4వ బహుమతి రూ.8 వేలను గెలుచుకున్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన రాయ రామిరెడ్డి గిత్తలు 4,553 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ.5 వేలను దక్కించుకుంది.

పోటీలను అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రం అధ్యక్ష ఉపాధ్యక్షులు గుంటా పుల్లారెడ్డి, పులి ఓబుల్‌రెడ్డి, కమిటీ సభ్యులు యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, గొట్టం రవీంద్రారెడ్డి, పత్తి కోటిరెడ్డి, దొండేటి వెంకటేశ్వరరెడ్డి, చింతా శివారెడ్డి, చేర్రెడ్డి కోటిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, మందలపు వెంకటరెడ్డి పర్యవేక్షించారు. కొండు వెంకట్రామిరెడ్డి, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ విభాగంలో రూ.20వేలను భాస్కర్‌రెడ్డి, రూ.15వేలను శ్రీనివాసరెడ్డి,  రవీంద్రారెడ్డి, రూ.10వేలను లింగారెడ్డి, రూ.8వేలను అంజిరెడ్డి, రూ.5వేలను  భాస్కర్‌రెడ్డి అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top