దినేష్ రెడ్డికి క్యాట్లో తప్పని నిరాశ | CAT denies Dinesh reddy's plea | Sakshi
Sakshi News home page

దినేష్ రెడ్డికి క్యాట్లో తప్పని నిరాశ

Sep 27 2013 2:57 PM | Updated on Nov 9 2018 5:52 PM

దినేష్ రెడ్డికి క్యాట్లో తప్పని నిరాశ - Sakshi

దినేష్ రెడ్డికి క్యాట్లో తప్పని నిరాశ

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దినేష్ రెడ్డికి క్యాట్లో చుక్కెదురైంది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దినేష్ రెడ్డికి క్యాట్లో చుక్కెదురైంది. తన పదవీ కాలాన్ని మరింత పొడిగించాలంటూ డీజీపీ క్యాట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం క్యాట్ తన తుది తీర్పు వెల్లడించింది. ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది. దినేష్ రెడ్డిని డీజీపీగా ఇక కొనసాగించలేమని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్కు నివేదిక ఇవ్వడంతో ఆయన ఆశలకు గండిపడక తప్పలేదు.  మరో ఏడాది పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ డిజిపి దినేష్ రెడ్డి క్యాట్ హైదరాబాద్ బెంచిని ఆశ్రయించారు.
 
'ప్రకాష్ సింగ్ - భారత ప్రభుత్వం' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా డీజీపీగా తన నియామకం జరిగిన తేదీ నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అవకాశమివ్వాలని దినేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.  కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.

Advertisement
 
Advertisement
Advertisement