వేమూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు | Case registered on mla anand babu | Sakshi
Sakshi News home page

వేమూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు

Dec 30 2013 8:33 AM | Updated on Aug 21 2018 6:21 PM

వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు - Sakshi

వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు

వేమూరు తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగిపై చేయి చేసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరు: వేమూరు తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగిపై చేయి చేసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.  రెవెన్యూ వర్గాల ఫిర్యాదు మేరకు ఆనందబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఓటర్ల నమోదు, తొలగింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేమూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగిపై ఆ పార్టీ ఎమ్మెల్యే  ఆనంద బాబు చేయిచేసుకున్నారు.  వేమూరు మండలంలో తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఫోర్జరీ సంతకాలు చేసి ఫిర్యాదు చేస్తే ఎలా తొలగిస్తారంటూ  ఎమ్మెల్యే ఆనందబాబు కార్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement