'కోర్టు ఆదేశాల మేరకే సల్మాన్పై కేసు నమోదు చేశాం' | case filed on actor salman khan according to court orders, says anurag sharma | Sakshi
Sakshi News home page

'కోర్టు ఆదేశాల మేరకే సల్మాన్పై కేసు నమోదు చేశాం'

Dec 20 2013 4:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

'కోర్టు ఆదేశాల మేరకే సల్మాన్పై కేసు నమోదు చేశాం' - Sakshi

'కోర్టు ఆదేశాల మేరకే సల్మాన్పై కేసు నమోదు చేశాం'

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై కోర్టు ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

హైదరాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై కోర్టు ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. బిగ్బాస్ టీవీ రియాల్టీ షోలో ఆయన ముస్లింల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు దర్శకుడు రజత్ రవాలీపై కూడా కేసు నమోదైంది. కాగా, న్యాయ నిపుణల అభిప్రాయం తీసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటామని అనురాగ్ శర్మ తెలిపారు.


మహ్మద్ ఫసీహుద్దీన్ అనే వ్యాపారవేత్త బిగ్బాస్పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఆ షో ఉందని ఆయన తెలిపారు. అందులోనే సల్మాన్ఖాన్, దర్శకుడు రజత్ రవాలీల విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. సల్మాన్ఖాన్ బిగ్బాస్లో పాల్గొంటున్నవారిని వారి ప్రదర్శన ఆధారంగా స్వర్గానికి, నరకానికి పంపుతాడని, ఆ రెండూ ముస్లింలకు చాలా పవిత్ర పదాలని తెలిపారు. దీంతో పిటిషన్ను విచారించిన కోర్టు, కేసు నమోదు చేయాలని ఫలక్నుమా పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement