ఎల్బీనగర్‌లో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | Cards gamblers arrested in LB Nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌లో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Dec 25 2013 5:06 PM | Updated on Sep 2 2017 1:57 AM

ఎల్బీనగర్లోని ఓ హెటల్పై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: నగరంలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా నడుపుతున్నారు. తాజాగా ఎల్బీనగర్లో ఓ హెటల్పై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ దాడుల్లో  పేకాట ఆడుతున్న 12మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3.75లక్షల రూపాయల విలువ చేసే కారు, ఐదు బైక్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement