కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గురువారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గురువారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. కాగా రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వేసుకొన్న సమైక్య ముసుగు క్రమేణా తొలగిపోతోంది. అధిష్టానం రూపొందించిన వ్యూహంలో భాగంగా వారంతా ఇపుడు రెండో అంకానికి తెరలేపుతున్నారు.
ఇప్పటికే కేంద్రమంత్రులు, సీమాంధ్ర ఎంపీలు సమైక్యస్వరాన్ని మార్చి విభజన వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. మిగతావారు కూడా అదే బాటపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొనేందుకు నేడు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ తొలిభేటీ అవుతోంది.