
మినీ బస్సు బోల్తా... ఏడుగురికి గాయాలు
మహానంది నుంచి కర్ణాటకకు వెళ్తున్న మినీ బస్సు బోల్తాపడి ఏడుగురు గాయపడ్డారు, ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
కర్నూలు జిల్లా మహానంది నుంచి కర్ణాటకకు వెళ్తున్న మినీ బస్సు బోల్తా పడి ఏడుగురు గాయపడ్డారు, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదం కర్నూలు జిల్లా మహానంది మండలం బోయినకుంట్ల మెట్ట రహదారిపై గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 7.30గంటలకు చోటు చేసుకుంది.
క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులు పుణ్యక్షేత్రాల దర్శనకోసం కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ నుంచి వచ్చి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.