వ్యక్తి దారుణ హత్య | brutal murder in ananthpur district | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Jul 30 2015 7:46 PM | Updated on Sep 3 2017 6:27 AM

కొంతమంది గుర్తతెలియని దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

అనంతపురం: కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమోత్తురు గ్రామం సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద జరిగింది. వివరాలు.. మోపిడి గ్రామానికి చెందిన వెంకటేష్(45) అనే వ్యక్తిని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేసి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement