పోలీస్‌ వ్యాన్‌ తాళం చెవి చోరీ | Unidentified persons stole the key to a police vehicle | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వ్యాన్‌ తాళం చెవి చోరీ

Jul 4 2026 7:21 AM | Updated on Jul 4 2026 8:40 AM

Unidentified persons stole the key to a police vehicle

హైదరాబాద్‌: పోలీస్‌ వాహనం తాళం చెవిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడంతో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద గురువారం మధ్యాహ్నం మాజీ మంత్రి హరీ‹Ùరావుతో పాటు మరి కొంతమందిని ముందస్తు అరెస్ట్‌ చేశారు. వీరందరినీ కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు తెలంగాణ భవన్‌ వద్ద ఓ పోలీస్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచి హరీష్‌ రావుతో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలను ఎక్కించారు. 

అప్పటికే హరీష్‌ రావును అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ వందలాదిగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీస్‌ వాహనానికి అడ్డుపడ్డారు. వ్యాన్‌ను స్టార్‌ చేయడానికి హోంగార్డు రవీందర్‌ నాయక్‌ ప్రయత్నించగా తాళం చెవి కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం చెవి దొంగిలించి హరీష్‌రావు వెళ్లే వాహనాన్ని అడ్డుకున్నారు.  అరగంటపాటు తాళం చెవి దొరకకపోవడంతో పోలీసులు తీవ్ర ఆందోళన చెందారు. అటు నుంచి వెళ్తున్న ఓ ఆటో తాళం చెవి తీసుకొని పోలీస్‌ వాహనాన్ని ఆన్‌ చేయగా వెంటనే స్టార్ట్‌కావడంతో ఎట్టకేలకు వ్యాన్‌ కదిలింది. రవీంద్రనాయక్‌  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement