ఎడ్ల పందేలకు మధ్యలోనే బ్రేక్ | Break between bullock bets | Sakshi
Sakshi News home page

ఎడ్ల పందేలకు మధ్యలోనే బ్రేక్

Jan 16 2014 4:07 AM | Updated on Aug 21 2018 7:53 PM

సంక్రాంతి పర్వదినం సందర్భంగా దామరమడుగులో బుధవారం నిర్వహించిన ఎడ్లతో బండ లాగుడు పందేలకు పోలీసులకు మధ్యలోనే బ్రేక్ వేశారు.

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా దామరమడుగులో బుధవారం నిర్వహించిన ఎడ్లతో బండ లాగుడు పందేలకు పోలీసులకు మధ్యలోనే బ్రేక్ వేశారు. మొదట పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గ్రామస్తుల కేరింతల మధ్య భారీ బండను ఎద్దులు లక్ష్యం వైపుగా లాక్కెళ్లాయి. రెండు రౌండ్ల పందేలు
 
 పూర్తవగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోటీల నిర్వహణకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఎంతోకాలంగా పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని గ్రామస్తులు వాదించినా ఎస్సై శ్రీనివాసరావు ససేమిరా అనడంతో నిలిచిపోయాయి. అనుమతి లేకుండా ఎడ్ల పందేలు నిర్వహించారంటూ తొమ్మిది మందిని బైండోవర్ చేసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement