కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం | bomb threat rumor in the Krishna Express | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం

May 20 2016 3:14 AM | Updated on Sep 4 2017 12:27 AM

కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం

కృష్ణా ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం

తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే వదంతి గురువారం కలకలం సృష్టించింది.

బాపట్ల స్టేషన్‌లో దిగిపోయిన ప్రయాణికులు
బాపట్ల: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే వదంతి గురువారం కలకలం సృష్టించింది. రైలు చీరాల స్టేషన్ దాటాక డి-5 బోగీలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైలులో బాంబు ఉందని భయపడ్డారు. ఆ విషయం కాస్తా రైలంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల స్టేషన్‌కు చేరుకోగానే రైలులోని సుమారు 2 వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకడం మొదలెట్టారు.

దీన్ని గమనించిన రైల్వే అధికారులు వారిని ప్రశ్నించగా.. రైలులో బాంబు ఉందని జవాబిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డి-5 బోగీని పరిశీలించారు. బ్రేక్ స్లిప్ అయ్యి పొగలు వస్తున్నాయని, ప్రమాదమేమీ లేదని ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా ప్రయాణికులందరూ రైలు ఎక్కేందుకు నిరాకరించడంతో గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్యాసింజర్‌లో కొంతమందిని, అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో మరికొంతమందిని ఎక్కించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement