‘అందుకు మోదీ విధాన నిర్ణయాలే కారణం’ | BJP Leader Satya Kumar Says PM Modi Decisions Are The Cause Of India Economic Growth | Sakshi
Sakshi News home page

‘అందుకు మోదీ విధాన నిర్ణయాలే కారణం’

Oct 10 2019 9:55 PM | Updated on Oct 10 2019 10:07 PM

BJP Leader Satya Kumar Says PM Modi Decisions Are The Cause Of India Economic Growth - Sakshi

సాక్షి, కర్నూలు: ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉంటే, భారత్‌ మాత్రం ఆర్థికపరంగా అభివృద్ధిలో దూసుకెళ్తుందని.. అందుకు ప్రధాని నరేంద్ర మోదీ విధాన నిర్ణయాలే కారణమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. కర్నూలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాత్ర దోహద పడుతుందన్నారు. గాంధీజీ సూచించిన మార్గాన్ని ప్రజలు ఆచరించే విధంగా చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలించడం, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలను పైకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement