‘పడవ ప్రమాదం.. అక్కడి ఎమ్మెల్యేదే బాధ్యత’

BJP Leader Purandeswari Reacts Godavari Boat Accident - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్పందించారు. మలాపురంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వనం-మనం కార్యక్రమంలో పాల్గొనడం కారణంగానే పిల్లలు గల్లంతయ్యారని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి అక్కడి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఆమె సూచించారు. పోలవరం బిల్లులు ఏవీ పెండింగ్‌ లేవు అని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు.

కన్నీరే.. గోదారై..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top