నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్ | bjp activists warn to shivaji | Sakshi
Sakshi News home page

నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్

Apr 26 2015 7:13 PM | Updated on Mar 29 2019 9:12 PM

నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్ - Sakshi

నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. శనివారం శివాజీ మీడియా సమావేశంలో మాట్లాతుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు.

శివాజీ అక్కడ నుంచి హోటల్కు వెళ్లగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని వ్యతిరేక నినాదాలు చేశారు. హోటల్ నుంచి ఆయన బయటకు రావాలని డిమాండ్ చేశారు. శివాజీ బీజేపీ అగ్రనేతలను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆయన బీజేపీ అగ్రనేతలపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీ బీజేపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఆయన బీజేపీ నేతలను తరచూ విమర్శిస్తున్నారని, వెంకయ్య నాయుడు, సోము వీర్రాజులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివాజీ, బీజేపీ నేతల వాగ్వాదం జరిగింది. హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన శివాజీ బీజేపీ నేతల గురించి తానేం మాట్లాడానని ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్యకర్తలను శాంతింపజేశారు. శివాజీని వేరే మార్గం ద్వారా అక్కడి నుంచి పంపించివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement