ఏపీకి కొత్త గవర్నర్‌

Biswabhusan Harichandan Appointed As a AP New Governor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత విశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహాన్‌ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్‌ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు.

1971లో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1977లో బీజేపీలో చేరారు. న్యాయవాద విద్యను అభ్యసించిన విశ్వభూషణ్‌.. ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. పలు పుస్తకాలు రచించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుత వయసు 85 ఏళ్లు కాగా.. ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇక చత్తీస్‌గడ్‌ నూతనగవర్నర్‌గా అనసూయ ఊకీ నియమితులయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top