‘వీవీ విడుదలకు జోక్యం చేసుకోండి’

Bhumana Karunakar Reddy Letter To Venkaiah Naidu On Varavarao - Sakshi

తిరుపతి సెంట్రల్‌: నిర్బంధంలో ఉన్న అభ్యుదయ రచయిత వరవరరావు(వీవీ) విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం లేఖ రాశారు. అనారోగ్యంతో వీవీ ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చమ్మగిల్లుతోందన్నారు.

తనకు లభించిన గురువుల్లో ఆయన కూడా ఒకరని తెలిపారు. 46 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ బాధితులుగా వెంకయ్య, తనతో పాటు వరవరరావు కూడా జైల్లో గడిపిన రోజులను గుర్తు చేశారు. రాజకీయ సిద్ధాంతాల్లోనూ, జన క్షేమం కోసం ఎవరి భావాలు వారివే అయినా మనుషులుగా అంతా ఒక్కటే అని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top