దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన | bhumana karunakar reddy condolence to dasari narayana rao | Sakshi
Sakshi News home page

దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన

May 31 2017 1:05 PM | Updated on Sep 5 2017 12:28 PM

దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన

దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి: భూమన

దాసరి నారాయణరావు ఎందరికో ఆశ్రయం ఇచ్చిన మహా పురుషుడని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: దర్శకరత్న దాసరి నారాయణరావు ఎందరికో ఆశ్రయం ఇచ్చిన మహా పురుషుడని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దాసరి ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి అని కొనియాడారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాతో కలిసి దాసరి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్‌ సీపీలో చేరి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేస్తానని ఇటీవలే తమతో చెప్పారని వెల్లడించారు.

దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దాసరి పెద్ద వృక్షం లాంటి వారని, ఎంతో మంది కళాకారులకు నీడనిచ్చారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement