భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మానం ఆమోదం పొందినా తెలంగాణ ప్రక్రియ ఆగదని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కాంతారావు, మిత్రసేన, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని రాష్ట్రపతి, ప్రధాని, సోనియా గాంధీని కోరేందుకు టి.మంత్రుల మంతా ఢిల్లీ వెళుతున్నారని చెప్పారు.
భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలనడం సరికాదన్నారు. పోలవరం డిజైన్ మారిస్తే ముంపు గ్రామాలు తగ్గుతాయని సూచించారు.