వలసకూలీలకు అండగా బేతేలు మినిస్ట్రీస్

Bethel Ministries and One Way Mission Helping Poor In Vijayawada - Sakshi

 సాక్షి, విజయవాడ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ దేశాలన్నింటిని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిలలాడిపోతుంది. కరోనా వైరస్‌ ఇండియాకు కూడా రావడంతో దాని వ్యాప్తిని అరికట్టడానికి మొదట్లోనే భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగులందరూ వర్క్‌  ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. అయితే రోజు కూలీ చేసుకొని బతికే వారి పరిస్థితే దయనీయంగా మారింది. పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం మొత్తం పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీరిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వచ్చి వాటికి తోచిన సహాయం చేస్తున్నాయి. (లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా)

లాక్‌డౌన్‌ మొదలైన రోజు నుంచి  స్వచ్ఛంద సంస్థలైన బేతేలు మినిస్ట్రీస్ (విజయవాడ), ఉంగుటూరు మండలం పొట్టిపడు గ్రామానికి చెందిన వన్ వే మిషన్ సంయుక్తంగా విజయవాడ నగరంలో, ఉంగుటూరు మండలంలోని గ్రామల్లో అనేకమంది వలస కూలీలకు, పేదలకు భోజనాన్ని అందిస్తున్నారు. కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలంలోని  17 గ్రామాలలో సుమారు 400 మంది వలస కూలీలకు రెండుపూటలా భోజనం అందిస్తున్నారు. సుమారు 1000 భోజన పాక్కెట్లు  పంచడం జరుగుతోందని సంస్థ డైరెక్టర్లు శ్రీ కొడాలి జోయెల్, కోడాలి ప్రేమ్ తెలియచేశారు. ఇవే కాక గ్రామాలలో ఇంతవరకు 1200 కుటుంబాలకు కూరగాయలు, 100 మంది వృద్దులకు విటమిన్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. బేతేలు, వన్ వే సంస్థలలో చదువుకున్న సుమారు 20 మంది విద్యార్థులు వాలంటీర్లగా ఎంతో శ్రమపడి భోజనం తయారు చేస్తున్నారని, రోజు 17 గ్రామాలు తిరిగి భోజనం సరఫరా చేస్తునందకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (ఆదుకునేందుకు ఏకమయ్యారు!)

చదవండి: మాతృభూమికోసం చేతనైన సాయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top