'మార్చిలో బీసీ సింహ గర్జన' | bc simha garjana to be in next month declares bc Communities | Sakshi
Sakshi News home page

'మార్చిలో బీసీ సింహ గర్జన'

Feb 9 2016 12:22 PM | Updated on Sep 3 2017 5:17 PM

కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే యోచనకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని వంద కులాల బీసీ వర్గ నేతలు నిర్ణయించారు.

విజయవాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే యోచనకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని వంద కులాల బీసీ వర్గ నేతలు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్లపై విజయవాడలోని ఐలాపురంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు పులువురు నేతలు హాజరు అయ్యారు.

కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మార్చిలో బీసీ సింహగర్జన నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపులను బీసీ జాబీతాలో చేర్చితే బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement