చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారు | Battula Brahmananda Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారు

May 18 2018 1:07 PM | Updated on May 18 2018 3:11 PM

Battula Brahmananda Reddy Slams Chandrababu - Sakshi

సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలతో ప్రజలను మోసం చేస్తూ.. రాజకీయాలను వ్యాపార సంస్థలుగా మార్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఇంకా బీజేపీతో చాటుమాటుగా కాపురం చేస్తుందని.. అలాంటి చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించే అర్హత లేదని అన్నారు.

నీతివంతమైన రాజకీయాలు చేయడం వైఎస్‌ జగన్‌కు అలవాటయితే.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ తన పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటని బత్తుల ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమిలేదని మండిపడ్డారు. రామాయపట్నం పోర్టు మొదలు వెలుగొండ ప్రాజెక్టు వరకు జిల్లాలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement