బ్యాంకింగ్‌ రంగంపై గీతంలో యూబీఐ అధ్యయన పీఠం

On The Banking Sector UBI Study Placement - Sakshi

సాక్షి, సాగర్‌నగర్‌ : బ్యాంకింగ్‌ రంగంలో వస్తున్న మార్పులపై నిరంతర అధ్యయానికి గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) అధ్యయన పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కతూరియా హామీ ఇచ్చారు. యూబీఐ కార్పొరేట్‌ కార్యాలయం ఉన్నతాధికారుల బృందం బుధవా రం వర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా కతూరియా మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ గీతం ప్రగతిని వివరించారు. వీసీ ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.ప్రసాద్‌ గాంధీయన్‌ అధ్యయన కేంద్రం, బ్యాంకింగ్‌ అధ్యయన కేంద్రం ప్రతిపాదనల గురించి వివరించారు. అనంతరం కతూరియాను వీసీ సత్కరించారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి బి.వి.మోహనరావు, పాలకవర్గ సభ్యుడు హమ్జాకె.మెహది, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కె.వి.గుప్తా, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ గోపాలకృష్ణ, యూబీఐ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర్, ప్రాంతీయ అధికారి కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, బ్యాంక్‌ అధికారులు  పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top