ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు | Bandicoot in Government Hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు

Oct 4 2015 4:17 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. వివరాల్లోకి  వెళితే.. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
అయితే లక్ష్మికి సహాయకురాలుగా వచ్చిన తల్లి ఎర్రమ్మ (55) ను ఆదివారం రాత్రి  పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడిన ఎర్రమ్మ నిద్ర నుంచి మేల్కొని చూస్తే.. వార్డులో పందికొక్కులు కనిపించాయి. గాయపడిన ఎర్రమ్మకు నర్సులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడం వల్ల పందికొక్కులు, ఎలుకలు ఎక్కువయ్యాయని.. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే.. ప్రాణాలే పోయే పరిస్థితి ఎదురైతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement