వాడివేడిగా బీఏసీ సమావేశం! | BAC meet continuous over bifurcation bill | Sakshi
Sakshi News home page

వాడివేడిగా బీఏసీ సమావేశం

Jan 28 2014 4:57 PM | Updated on Jun 18 2018 8:10 PM

బీఏసీ సమావేశంలో రాష్ట్ర విభజన బిల్లుపై వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై బీఏసీ సమావేశంలో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ పట్టుబడుతుంది. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డిప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎంలు తప్పుబట్టాయి.

 

సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్ చేస్తున్నారు. విభజన బిల్లుపై ఓటింగ్, సమైక్య తీర్మానం అవసరం లేదని వారు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా కొనసాగుతున్నఈ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతికి పంపాలని టి.నేతలు సూచిస్తున్నారు. బిల్లుపై 150 సభ్యలు మాట్లాడాల్సి ఉందని, బిల్లు గడువును మరింత పెంచాలని సీమాంధ్ర నేతలు పట్టుబడుతున్నారు. బిల్లుపై ఓటింగ్ ఉండాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement